విక్రమ్‌–1 విజయంలో చింతపట్ల వాసి | - | Sakshi
Sakshi News home page

విక్రమ్‌–1 విజయంలో చింతపట్ల వాసి

Jul 30 2026 7:18 AM | Updated on Jul 30 2026 7:18 AM

విక్రమ్‌–1 విజయంలో చింతపట్ల వాసి

యాచారం: మండల పరిధిలోని చింతపట్లకు చెందిన యువకుడు రాకెట్‌ విక్రమ్‌–1 (ఆగమన్‌) విజయంలో పాలుపంచుకున్నాడు. గ్రామానికి చెందిన గౌరోజ్‌ రామచారి, జయమ్మల కుమారుడు శివప్రసాద్‌ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి పూర్తి చేశాడు. యాచారం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌, హయత్‌నగర్‌లోని వర్డ్‌ అండ్‌ డీడ్‌లో ఐటీఐ( మెకానికల్‌), ఆ తర్వాత ఆన్‌లైన్‌ ద్వారా కేరళలోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాల నుంచి డిప్లొమా చదివాడు. ప్రయోగాలపై ఆసక్తి పెంచుకున్న ఆయన ఆదిబట్లలోని టాటా బోయింగ్‌లో ఐదేళ్ల పాటు మెకానికల్‌ ఇంజనీరింగ్‌గా ఉద్యోగం చేశారు. 2022 నుంచి తుక్కుగూడలోని స్కైరూట్‌ ఏరోస్పేస్‌లోని క్వాలిటీ డిపార్ట్‌మెంట్‌లో ఇంజనీరింగ్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ రాకెట్‌ తయారీ బృందంలోని క్వాలిటీ విభాగంలో శివప్రసాద్‌ పాలుపంచుకోవడంపై జిల్లా ప్రజలు అభినందనలతో ముంచెత్తారు.

యువ ఇంజనీర్‌కు అభినందనల వెల్లువ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement