షాబాద్: ఇటీవల మాతృవియోగానికి గురైన పట్నం సోదరులను బీఆర్‌ఎస్ నేతలు పరామర్శించారు. షాబాద్‌లోని జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పట్నం అవినాశ్‌రెడ్డి నివాసంలో మంగళవారం మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, సబితా రెడ్డి, సత్యవతి రాథోడ్, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, మహేశ్‌రెడ్డి, ధర్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, డీసీసీబీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి తదితరులు రుక్కమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం పట్నం మహేందర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డిని పరామర్శించారు.


