ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి

Jul 29 2026 9:51 AM | Updated on Jul 29 2026 9:51 AM

కడ్తాల్‌: ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్‌) జిల్లా అధ్యక్షుడు కోట్ల కాశీరావు అన్నారు. టీపీయూఎస్‌ ఆధ్వర్యంలో ఆగస్టు 1న చేపట్టనున్న మహాధర్నకు సంబంధించిన వాల్‌పోస్టర్లను మంగళవారం మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోట్ల కాశీరావు మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌ డీఏలు, ఎరియర్స్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలపై ఆగస్టు 1న హైదరాబాద్‌లో జరిగే మహాధర్నాకు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం వివిధ మండలాల అధ్యక్షులు భాస్కర్‌గౌడ్‌, స్వాతి, ప్రధాన కార్యదర్శులు సంతోష్‌కుమార్‌, మౌనిక, శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

ఆమనగల్లులో పోస్టర్ల ఆవిష్కరణ

ఆమనగల్లు: ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై టీపీయూఎస్‌ నిరంతరం పోరాడుతుందని సంఘం జిల్లా అధ్యక్షుడు కోట్ల కాశీరావు అన్నారు. ఆగస్టు 1న నిర్వహించే మహాధర్నా పోస్టర్లను పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షురాలు స్వాతి, ప్రధాన కార్యదర్శి మౌనిక, నాయకులు భాస్కర్‌గౌడ్‌, సంతోష్‌కుమార్‌, ఎంఈఓ పాండు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement