జల భాగ్యం | - | Sakshi
Sakshi News home page

జల భాగ్యం

Jun 30 2026 4:44 PM | Updated on Jun 30 2026 4:44 PM

పాతికేళ్ల అవసరాలకనుగుణంగా ప్రణాళికలు

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌.. విశ్వనగరంగా శరవేగంతో విస్తరిస్తున్న వేళ రాబోయే పాతికేళ్ల జనాభా వృద్ధిని, పారిశ్రామిక, వాణిజ్య అవసరాలను శాసీ్త్రయంగా అంచనా వేసేందుకు జలమండలి అత్యంత ప్రతిష్టాత్మకమైన సుదీర్ఘ కార్యాచరణకు సన్నద్ధమవుతోంది. భావి తరాల తాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు అత్యాధునిక మురుగునీటి పారుదల వ్యవస్థను పటిష్టపర్చడమే లక్ష్యంగా ‘క్యూర్‌ వాటర్‌, సీవరేజ్‌ మాస్టర్‌ ప్లాన్‌–2047‘ను సిద్ధం చేస్తోంది. నాలుగైదు నెలల్లో ప్రభుత్వానికి డీపీఆర్‌ సమర్పించేలా చర్యలు చేపట్టింది.

2,053 చ.కి.మీ మేర..

ఓఆర్‌ఆర్‌ లోపలే కేంద్రీకృతమైన హైదరాబాద్‌ నివాస ప్రాంతాలు, పరిశ్రమలు ఇప్పుడు ఆ పరిధి దాటి శరవేగంగా దూసుకుపోతున్నాయి. 2047 నాటికి 2,053 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించబోయే నివాస సముదాయాలను, వాణిజ్య హబ్‌లను అంచనా వేస్తూ సుదీర్ఘ మాస్టర్‌ ప్లాన్‌కు రంగం సిద్ధమైంది. భషష్యత్‌ జనాభా అవసరాలకు సరిపడా అత్యుత్తమ తాగునీటి గ్రిడ్‌ను, మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో ఈ ప్లాన్‌ ద్వారా శాసీ్త్రయంగా క్రోడీకరిస్తున్నారు. ప్రతి నివాసానికి ప్రభుత్వ గ్యారంటీతో కూడిన వసతులు కల్పించడమే ఈ బృహత్తర ప్రణాళిక ప్రధాన ఉద్దేశం.

అంతర్గత విశ్లేషణతో..

వాటర్‌, సీవరేజీ మాస్టర్‌ ప్లాన్‌ కాగితాలకే పరి

మితం కాకుండా క్షేత్రస్థాయి వాస్తవాలకు అనుగు

ణంగా ఉండేలా జలమండలి శ్రద్ధ తీసుకుంటోంది. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, విద్యుత్‌ తదితర శాఖల సమన్వయంతో అంతర్గత విశ్లేషణ (గ్యాప్‌ అనాలసిస్‌) జరుపుతోంది. భవిష్యత్‌ డిమాండ్‌–సప్లయ్‌ అంచనాలను లెక్కిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సమగ్ర నివేదికను రూపొందించే బాధ్యతను ప్రముఖ కన్సల్టెన్సీకి అప్పగించింది. ఆయా సంస్థలు క్షేత్రస్థాయిలో పర్యటించి భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా డిజైన్లను సిద్ధం చేస్తున్నాయి. మరోవైపు భావి తరాల అవసరాలను పూర్తిగా తీర్చేలా ‘వాటర్‌ సప్లయ్‌– సీవరేజీ’ వ్యవస్థలను అనుసంధానించనున్నారు. వర్షపు నీరు వృథా కాకుండా భూగర్భ జలాల రీచా ర్జ్‌ పద్ధతులు, శుద్ధి చేసిన మురుగునీటిని పారిశ్రామి క అవసరాలకు పునర్వినియోగించడం వంటి వినూ త్న అంశాలను ఇందులో పొందుపర్చనున్నారు.

ప్రస్తుతం జలమండలి నెట్‌వర్క్‌

జలమండలి పరిధి : 1,450.2 చ.కి.మీ

నీటి సరఫరా పైపులైన్‌ వ్యవస్థ (చ.కి.మీ): 12,957.08

వాటర్‌ వాల్వ్‌ల సంఖ్య : 67,503

నల్లా కనెక్షన్లు : 14,49,815

ప్రస్తుతం తాగునీటి సరఫరా : 583 ఎంజీడీ

మురుగునీటి పైపులైన్‌ నెట్‌వర్క్‌ పొడవు (కి.మీ) : 9,145.66

మ్యాన్‌హోళ్ల సంఖ్య : 4,85,293

డీపీఆర్‌ రూపకల్పన ప్రైవేటు ఏజెన్సీలకు

నాలుగైదు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక

క్యూర్‌ వాటర్‌, సీవరేజీ మాస్టర్‌ ప్లాన్‌ – 2047

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement