పెట్రోల్ పోసుకుని
వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం
యాచారం: జీవితంపై విరక్తి చెందిన ఓ వృద్ధురాలు ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన యాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలివీ.. మండల పరిధిలోని చింతపట్ల గ్రామానికి చెందిన గుండ్ల మల్లమ్మ(70) కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన ఆమె సోమవారం ఇంటి సమీపంలోనే పెట్రోల్ మీద పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలైన ఆమెను గ్రామస్తులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
‘దేవేందర్ నగర్’ దాడి కేసులో 13 మంది అరెస్టు
మేడిపల్లి: బోడుప్పల్‌లోని దేవేందర్ నగర్ కాలనీలో గృహప్రవేశ వేడుక సందర్భంగా జరిగిన మూకదాడి ఘటనలో 13 మందిని మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. జూన్ 27న రాత్రి అనూప్ కుమార్ గృహప్రవేశ కార్యక్రమం నిర్వహిస్తుండగా స్వల్ప గొడవను మనసులో పెట్టుకున్న 15 నుండి 20 మంది ద్విచక్ర వాహనాలపై వచ్చి కర్రలు, హాకీ స్టిక్స్‌తో అనూప్ కుమార్, కుటుంబ సభ్యులపై దాడి చేశారు. అనంతరం ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి సామగ్రిని ధ్వంసం చేయడంతో పాటు కార్లు, బైక్‌లను కూడా పగలగొట్టారు. ఈ ఘటనను సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తున్న విలేకరి విష్ణు గౌడ్‌పై కూడా దుండగులు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి 13 మందిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. మిగతానిందితుల కోసం గాలిస్తున్నామని ఇన్‌స్పెక్టర్ జలేందర్ రెడ్డి తెలిపారు.


