నియోపోలిస్ సమగ్ర మంచినీటి సరఫరా ప్రాజెక్టు పనులను సోమవారం జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పరిశీలించారు. అనంతరం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పంపింగ్ స్టేషన్, డబ్ల్యూటీపీ నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతకుముందు హెచ్‌ఎండీఏ అధికారులతో కలిసి ఖానాపూర్ సమీపంలో ప్రతిపాదిత రహదారి నిర్మాణానికి అనుగుణంగా ప్రస్తుతం ఉన్న 1200 ఎంఎం డయా తాగునీటి పైపులైన్ షిఫ్టింగ్ పనులను పరిశీలించారు. ఖానాపూర్‌లో నిర్మాణంలో ఉన్న గోదావరి ఫేజ్–2, 3 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ (డబ్ల్యూటీపీ) పనుల పురోగతిని సమీక్షించి, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట జలమండలి ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్, సీజీఎం రాజశేఖర్ తదితరులున్నారు.


