చేరేదెప్పటికో! | - | Sakshi
Sakshi News home page

చేరేదెప్పటికో!

Jun 19 2026 7:45 AM | Updated on Jun 19 2026 7:45 AM

శుక్రవారం శ్రీ 19 శ్రీ జూన్‌ శ్రీ 2026 8లోu

న్యూస్‌రీల్‌

సకాలంలో పంపిణీ చేయాలి

శుక్రవారం శ్రీ 19 శ్రీ జూన్‌ శ్రీ 2026
చెరువులోకి..

వర్షాకాలం ప్రారంభమైనా ఇప్పటికీ టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు.. జాప్యం చేస్తే చేపల ఎదుగుదలపై ప్రభావం పడుతుందని అంటున్నారు మత్స్యకారులు.. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

షాద్‌నగర్‌: మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవడంతో పాటు చేపల ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీ పథకంపై నీలి నీడలు అలముకున్నాయి. ఏటా వర్షాకాలం ప్రారంభం కంటే ముందే పంపిణీ కోసం ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించేది. ఈ ఏడాది ఇప్పటి వరకు టెండర్ల ప్రక్రియ ఊసేలేదు. దీంతో ఈసారి ప్రభుత్వం చేప పిల్లలను పంపిణీ చేస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇదీ పరిస్థితి

జిల్లాలోని 27 మండలాల్లో మొత్తం నీటి వనరులు ఉన్న చెరువులు, కుంటలు 1,100 ఉన్నాయి. వీటి విస్తీర్ణం సుమారు 15 వేల హెక్టార్ల వరకు ఉంటుంది. 210 మత్స్యసహకార సంఘాల్లో 10 వేల మంది మత్స్యకారులు ఉన్నారు. సుమారు 15వేల మంది చేపలు పట్టడం, వాటిని విక్రయించడం ద్వారా మత్స్యకార వృత్తిపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారు. 2016–17లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. గత ఏడాది చెరువులు, కుంటల్లో రెండు కోట్ల చేప పిల్లలను వదలాలని అధికారులు లక్ష్యం పెట్టుకోగా 160 చెరువుల్లో 45 లక్షల చేప పిల్లలను మాత్రమే వదిలారు.

ఆలస్యం చేస్తే నష్టం

వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు, కుంటల్లోకి నీరు చేరే సమయానికి ఉచిత చేప పిల్లలను వదిలే అవకాశం ఉంటుందో లేదో అన్నది అనుమానంగా ఉంది. నేటికీ చేప పిల్లల టెండర్‌ ప్రక్రియ మొదలు కాకపోవడంతో మత్య్సకారుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఏటా జిల్లాలో ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం జరిగేది. అప్పటి వరకు వర్షాలు పుష్కలంగా కురిసి చెరువుల్లో నీరు సమృద్ధిగా ఉంటాయి. ఆ సమయంలో చేప పిల్లలు వదిలితే మంచిగా ఎదిగేందుకు అవకాశం ఉండటంతో పాటు, ఎదిగిన చేపల విక్రయాల ద్వారా మత్య్సకారులకు ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది. ఆలస్యం చేస్తే చేపలు ఎదగడం కష్టంగా మారుతుందని మత్స్యకారులు అంటున్నారు.

ఆదేశాలు వచ్చిన వెంటనే..

చేప పిల్లల పంపిణీకి సంబంధించి ఇప్పటి వరకు టెండర్ల ప్రక్రియ ప్రారంభం కాలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే చర్యలు చేపట్టి చేప పిల్లలను పంపిణీ చేస్తాం.

– వెంకయ్య, జిల్లా మత్స్యశాఖ అధికారి

ధర్మాన్ని రక్షించాలనే తపన ఉండాలి

చేప పిల్లల పంపిణీపై కమ్ముకున్న నీలినీడలు

ఊసే లేని టెండర్ల ప్రక్రియ

ప్రభుత్వం నుంచి కరువైన స్పష్టత

ఆందోళనలో మత్స్యకారులు

పంపిణీపై అనుమానాలు

చేపపిల్లల పంపిణీ కోసం ప్రభుత్వం ప్రతి సంవత్సరం జిల్లాల వారీగా టెండర్లను నిర్వహిస్తోంది. టెండర్‌ దక్కించుకున్న షిష్‌ సీడ్‌ ఫార్మర్లు చేప పిల్లలను ఉచితంగా చెరువుల్లో వదలాల్సి ఉంటుంది. తర్వాత ప్రభుత్వం వారికి డబ్బులు చెల్లిస్తుంది. ఈసారి జూలై నెల దగ్గర పడుతున్నా టెండర్లు, పెండింగ్‌ బిల్లలకు సంబంధించిన అంశంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేదు. దీంతో ఉచిత చేప పిల్లల్ల పంపిణీ కార్యక్రమం అమలుపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గత ఏడాది చేప పిల్లల పంపిణీలో అవకతవకలు జరినట్లు ఆరోపణలు ఉన్నాయి. బోగస్‌ లబ్ధిదారులతో కుమ్మక్కై అధికారులు నిధులు స్వాహా చేసినట్లు మత్స్యకారులు గతంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు సైతం చేశారు. ఈసారి చేప పిల్లల పంపిణీ పారద్శకంగా నిర్వహించాలని కోరుతున్నారు.

వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో చేప పిల్లలను సకాలంలో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. టెండర్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి.

– గుంటి శంకరయ్య, మత్స్యకారుడు, షాద్‌నగర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement