శంకర్‌పల్లి: పదో తరగతిలో టాపర్లుగా నిలిచే మున్సిపల్‌కి చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ముగ్గురిని విమానంలో టూర్‌కి తీసుకెళ్లనున్నట్లు మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్, వైస్ చైర్మన్ శ్వేత ప్రకటించారు. పట్టణంలోని ఆదర్శ పాఠశాలలో గురువారం విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఏర్పర్చుకొని, దాన్ని సాధించేందుకు నిరంతరం శ్రమించాలని సూచించారు. వచ్చే ఏడాది జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన మున్సిపల్ విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శోభారాణి, నాయకులు పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


