కార్యకర్తలను కాపాడుకుంటాం | - | Sakshi
Sakshi News home page

కార్యకర్తలను కాపాడుకుంటాం

Jun 19 2026 7:45 AM | Updated on Jun 19 2026 7:45 AM

చేవెళ్ల: కష్టకాలంలో పార్టీకోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలను గుర్తుపెట్టుకొని కాపాడుకుంటామని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి అన్నారు. చేవెళ్లలోని అట్లాస్‌ ఫంక్షన్‌హాల్‌లో గురువారం బీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పాలనతో విసుగు చెందిన ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు నాయకులు కష్టపడి పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో మన ఓటర్లను తొలగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత గ్రామస్థాయిలో బూత్‌ కమిటీలపై ఉందన్నారు. పార్టీశ్రేణులకు తగిన గుర్తింపు ఉంటుందనే భరోసా కల్పించేందుకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారని చెప్పారు. ఈనెల 25న చేవెళ్లలో కూడా పర్యటిస్తారని తెలిపారు. సమావేశంలో బూత్‌ కమిటీల నియోజకవర్గ ఇన్‌చార్జి రాంబాబు, రాష్ట్ర నాయకుడు నాగేందర్‌గౌడ్‌, నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు దేశమోళ్ల ఆంజనేయులు, డీసీసీ మాజీ అధ్యక్షుడు పి.కృష్ణారెడ్డి, పార్టీ సీనియర్‌ నాయకులు అనంత్‌రెడ్డి, రంగారెడ్డి, సర్పంచ్‌ మల్లారెడ్డి, పలువురు కౌన్సిలర్లు, మండలాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement