ఇచ్చిన మాటకు కట్టుబడి నేత్రదానం | - | Sakshi
Sakshi News home page

ఇచ్చిన మాటకు కట్టుబడి నేత్రదానం

Jun 19 2026 7:45 AM | Updated on Jun 19 2026 7:45 AM

ఇచ్చిన మాటకు కట్టుబడి నేత్రదానం

స్ఫూర్తిగా నిలుస్తున్న ఇక్కారెడ్డిగూడ

చేవెళ్ల: ఇచ్చిన మాటకు కట్టుబడి ఆదర్శంగా నిలుస్తోంది మండలంలోని ఇక్కారెడ్డిగూడ గ్రామం. గ్రామస్తులంతా కలిసి మరణానంతరం నేత్రదానాలు చేస్తామని 2015లో తీసుకున్న సంకల్పాన్ని నిరంతరం కొనసాగిస్తున్నారు. నగరంలోని ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రికి అంగీకారపత్రాలు అందించారు. తాజాగా గ్రామంలో బస్తేపురం అంతయ్య (65) బుధవారం సాయంత్రం అనారోగ్యంతో మృతిచెందాడు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన కుమారుడు శ్రీనివాస్‌ ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రివారికి సమాచారం ఇవ్వడంతో రాత్రి ఆస్పత్రి వర్గాలు వచ్చి నేత్రాలను సేకరించారు. గ్రామంలో అంగీకారం తెలిపిన తరువాత చేస్తున్న 17వ నేత్రదాతగా అంతయ్య నిలిచారు. పదేళ్ల కిత్రం ఇచ్చిన మాటను కూడా మరిచిపోకుండా గ్రామస్తులు నేత్రదాన స్ఫూర్తిని కొనసాగించడం అభినందనీయమని మండలంలోని పలువురు అభినందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement