గుర్తు తెలియని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వ్యక్తి మృతి

Jun 19 2026 7:45 AM | Updated on Jun 19 2026 7:45 AM

అనంతగిరి: గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు వికారాబాద్‌ రైల్వే పీఎస్‌ ఇంచార్జి హరిప్రసాద్‌ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. గురువారం ఉదయం ధారూరు–గోధంగూడ మధ్యలో రైల్వే ట్రాక్‌ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు సమాచారం రావడంతో రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుని వద్ద చిరునామాకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడు అందాజా 40 సంవత్సరాలు ఉంటాడని, ఒంటిపై నీలం రంగు షర్ట్‌, పింక్‌–తెలుపు రంగు షార్ట్‌ ప్యాంట్‌ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని వికారాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురికి తరలించి భద్రపరిచారు. ఎవరైనా సమాచారం, ఆచూకీ తెలిస్తే వికారాబాద్‌ రైల్వే పీఎస్‌లో సంప్రదించాలని ఆయన తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement