కొందుర్గు: పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం మండల పరిధిలోని ఉమ్మెంత్యాలలో రూ.2.46 కోట్లతో నిర్మించనున్న బీటీరోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అదేవిధంగా చిన్న ఎల్కిచర్ల గ్రామంలో ఆర్‌ఓ ప్లాంటు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాల్లో ప్రజలందరు భాగస్వామ్యం కావాలని అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఆధ్యానంగా ఉన్న ఉమ్మెంత్యాల రోడ్డుకు మోక్షం లభించిందన్నారు. అదేవిధంగా గ్రామంలో నిర్వహించిన మైసమ్మ విగ్రహ ప్రతిష్ఠలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ సులోచన, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్


