ఎస్టీపీలు నిర్మించాలి
చెరువులు కలుషితం
మురుగు చేరి..
మొయినాబాద్: మున్సిపాలిటీతో పాటు మండలం మొత్తంలో 48 చెరువులు, కుంటలున్నాయి. వీటిలో కొన్ని కబ్జాలకు గురికాగా మరికొన్ని చెరువులు మురుగునీటితో నిండిపోయాయి. మున్సిపాలిటీ పరిధిలోని పెద్దమంగళారం ఊరుముందు కుంట, చిలుకూరు పెద్ద చెరువు, మొయినాబాద్ దర్గ చెరువు, హిమాయత్‌నగర్ బూరుగుకుంట, ఎనికేపల్లి మాల కుంట, బంగాలిగూడ బంగాలిచెరువు పూర్తిగా కలుషితమయ్యాయి. ఆయా గ్రామాల్లోని మురుగు నేరుగా కుంటల్లో కలుస్తోంది. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పైప్‌లైన్లను సైతం నేరుగా చెరువులు, కుంటల వద్దకు తీసుకెళ్లి వాటిలో వదిలేశారు. అదే విధంగా మండలంలోని నాగిరెడ్డిగూడ అబ్బుకుంట, అమ్డాపూర్ పటేల్‌కుంట, చిన్నమంగళారం చిన్నచెరువు, మేడిపల్లి మేడికుంట, కుమ్మరికుంటలోకి నేరుగా మురుగునీరు వెళ్లి చేరుతుంది. దీంతో ఆయా చెరువులు, కుంటల్లోని నీరంతా కాలకూట విషంలా మారిపోయింది.
దుర్గంధభరితంగా ఊర చెరువులు, కుంటలు
నేరుగా చేరుతున్న వ్యర్థాలు, డ్రైనేజీ నీరు
కలుషితమవుతున్నా పట్టించుకోని అధికార యంత్రాంగం
చెరువులు, కుంటల్లోకి మురుగు చేరకుండా ఎస్టీపీలు నిర్మించాలి. కానీ అది ఖర్చుతో కూడుకున్న పని. పెద్దమంగళారంలోని ఊరుముందు కుంటలో నీటిని శుద్ధి చేసేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది. జలమండలి ఆధ్వర్యంలో హిమాయత్‌నగర్, నాగిరెడ్డిగూడ వద్ద రెండు ఎస్టీపీలు నిర్మిస్తున్నారు. అవి పూర్తయితే మురుగు నీటిని వాటిలోకి మళ్లించే అవకాశం ఉంది.
– జాకీర్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్, మొయినాబాద్
గ్రామాల్లోని మురుగునీరు చెరువులు, కుంటల్లో చేరడంతో అవి కలుషితం అవుతున్నాయి. చిలుకూరు పెద్ద చెరువులోకి మొయినాబాద్, చిలుకూరు మురుగునీరు నేరుగా చేరుతోంది. మొయినాబాద్ నుంచి పైప్‌లైన్ వేసి పెద్దచెరువులో మురుగు వదులుతున్నారు. చేపలు పెంచుతున్న చెరువుల్లోకి మురుగునీరు చేరడంతో రోగాలు వచ్చే ప్రమాదం ఉంది.
– జొన్నాడ రాజు, చిలుకూరు


