ఎస్‌ఐఆర్‌పై ఆరోపణలు మానుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐఆర్‌పై ఆరోపణలు మానుకోవాలి

Jun 18 2026 8:04 AM | Updated on Jun 18 2026 8:04 AM

ఎస్‌ఐఆర్‌పై ఆరోపణలు మానుకోవాలి మహిళా రైతుల సంఘాలు వృద్ధి సాధించాలి హుండీ ఆదాయం లెక్కింపు

కొత్తూరు: ఎస్‌ఐఆర్‌, జనగణనపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మొద్దని బీజేపీ షాద్‌నగర్‌ ఇన్‌చార్జి అందె బాబాయ్య పేర్కొన్నారు. మండలంలోని ఇన్ముల్‌నర్వలో బుధవారం కొత్తూరు మున్సిపాలిటీ, మండలం, నందిగామ మండలానికి చెందిన ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు రాష్ట్ర నాయకుడు శ్రీవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌ భారత ఎన్నికల వ్యవస్థలో ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ప్రక్రియ అనే విషయాన్ని విపక్షాలు గుర్తించాలన్నారు. ఎస్‌ఐఆర్‌ను మోదీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిందనే అబద్ధాలను ప్రజలకు చెప్పి.. విపక్షాలు తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. కాంగ్రెస్‌ హయాంలో సైతం ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ నిర్వహించినట్లు గుర్తుచేశారు. దేశంలో అర్హులైన ప్రతీ ఒక్కరికి ఒకేచోట ఓటు హక్కు, మరణించిన వారి పేర్లు జాబితా నుంచి తొలగించడం, ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఓటర్ల పేర్ల సవరణ, ఇతర వివరాలతో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ సాగుతోందన్నారు. దీంట్లో ఎలాంటి అక్రమాలు, ఇతర దురుద్దేశాలు లేవనే విషయాన్ని విపక్షాలు గుర్తించకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇతర దేశాల వారికి ఓటుహక్కు కల్పిస్తే స్తానిక ప్రజలతో పాటు మనదేశానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. నిజాలను చెప్పకుండా విపక్షాలు ఎస్‌ఐఆర్‌పై ప్రజల్లో భయాందోళనలు కల్పించడం మానుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు దేపల్లి అశోక్‌గౌడ్‌, వెంకటరమణ, నర్సింహాగౌడ్‌, వెంకటేశ్‌యాదవ్‌, రణధీర్‌గౌడ్‌, మాణిక్యం, నాగరాజుచారి, మోహన్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

సెర్ప్‌ ఫార్మ్‌ డైరెక్టర్‌ రవీందర్‌

కేశంపేట: మహిళా రైతులు రైతు సంఘాలను ఏర్పాటుచేసుకుని ఆర్థికంగా ఎదగాలని సెర్ప్‌ ఫార్మ్‌ డైరెక్టర్‌ రవీందర్‌ అన్నారు. మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో బుధవారం భూతల్లి ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌ ద్వితీయ వార్షికోత్సవ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా రైతు సంఘాలు ఏర్పాటు చేసుకుని చిన్న, సన్నకారు రైతులు సేంద్రియ సాగుతో పాటు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు. మార్కెటింగ్‌ చేస్తూ వ్యాపార అభివృద్ధిని సాధించాలన్నారు. అనంతరం భూతల్లి ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ వార్షిక ఆదాయంతో పాటు గతేడాది చేపట్టిన కార్యక్రమాల వివరాలను సభ్యులకు కంపెనీ చైర్మన్‌ కడారి విజయ వివరించారు. అనంతరం భూతల్లి ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ బోర్డు నూతన చైర్‌పర్సన్‌గా విజయ, వైస్‌ చైర్‌పర్సన్‌గా లక్ష్మిని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంలు కవిత, సౌజన్య, శ్రీనివాసులు, డీపీఎం నర్సింహ, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

తాండూరు రూరల్‌: మండలంలోని కొత్లాపూర్‌ రేణుక ఎల్లమ్మ ఆలయ హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. మే ఒకటి నుంచి 31వ తేదీ వరకు అమ్మవారి జాతర కొనసాగింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి కానుకలు సమర్పించారు. ఆలయ ఆవరణలో లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. రూ.6,92,047 సమకూరినట్లు ఆలయ ఈఓ శేఖర్‌గౌడ్‌, చైర్మన్‌ ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయ ఈఓ బాల నర్సింహ పర్యవేక్షించారు. కరన్‌కోట్‌ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ డైరక్టర్లు సుజాత, నర్సింలు, పుఠ్యానాయక్‌, రాజుగౌడ్‌, రాజు, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement