ప్రతి ఇంటికీ సంక్షేమం | - | Sakshi
Sakshi News home page

ప్రతి ఇంటికీ సంక్షేమం

Jun 18 2026 8:04 AM | Updated on Jun 18 2026 8:04 AM

ప్రతి ఇంటికీ సంక్షేమం వ్యక్తి అదృశ్యం

స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌

మోమిన్‌పేట: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. బుధవారం మండలంలోని సుద్దోడ్కతండా, మిఠ్యానాయక్‌ తండా, లచ్చానాయక్‌ తండాల్లో రూ.కోటితో బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధిలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. గ్రామాల్లో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఇందుకోసం పైలెట్‌ ప్రాజెక్టు కింద అంరాధికలాన్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. వచ్చే ఆరు నెలల్లో ఆసరా పింఛన్ల సంఖ్యను పెంచుతామన్నారు. సర్పంచ్‌ లక్ష్మి, ఏఎంసీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు శంకర్‌, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు సురేందర్‌, ఎంపీడీఓ సృజన సాహిత్య, తహసీల్దార్‌ మునిరొద్దీన్‌ పాల్గొన్నారు.

కేశంపేట: ఇంటికి రాత్రి వేళ ఆలస్యంగా వచ్చినందుకు భార్య నిలదీయడంతో భర్త అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. సీఐ నరహరి, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన మంగలి మల్లేశ్‌ హెయిర్‌ కటింగ్‌ షాప్‌ నిర్వహిస్తూ భార్య అనూష ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 16న రాత్రి మల్లేశ్‌ మధ్యం సేవించి రాత్రి ఇంటికి ఆలస్యంగా రావడంతో భార్య అనూష తాగొద్దని భర్తను హెచ్చరించింది. దీంతో మనస్తాపం చెందిన మల్లేశ్‌ బుధవారం ఉదయం సెలూన్‌కు వెళ్తున్నాని చెప్పి షాపు తీయలేదు. ఫోన్‌ చేసినా స్విచ్ఛాఫ్‌ రావడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement