పాతపద్ధతిలోనే ఎరువులు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

పాతపద్ధతిలోనే ఎరువులు ఇవ్వాలి

Jun 18 2026 7:58 AM | Updated on Jun 18 2026 7:58 AM

పాతపద్ధతిలోనే ఎరువులు ఇవ్వాలి సంపూర్ణ రుణమాఫీకి డిమాండ్‌ బీఆర్‌ఎస్‌ పాలనలోనే విప్లవాత్మక మార్పులు ఉద్యమ కళాకారుల సంఘం అధ్యక్షుడిగా బాలు

భారతీయ కిసాన్‌ సంఘ్‌ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి

మొయినాబాద్‌ రూరల్‌: ఫెర్జిలైజర్‌ యాప్‌తో రైతులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని.. పాత పద్ధతి ప్రకారమే ఎరువులు, విత్తనాలు అందజేయాలని భారతీయ కిసాన్‌ సంఘ్‌ జిల్లా అధ్యక్షుడు సామ మాధవరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన మండల రైతువేదికలో మండల వ్యవసాయాధికారి అనురాధకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నర్సింహారెడ్డి, బసవరాజ్‌, మల్లేశ్‌, మాధవరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నరేందర్‌, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

బడంగ్‌పేట్‌: ప్రభుత్వం రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు, సీపీఐ సీనియర్‌ నాయకుడు కొంతం మాధవరెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం బాలాపూర్‌ మండలంలోని గుర్రంగూడ, అల్మాస్‌గూడ, బాలాపూర్‌, మల్లాపూర్‌, సుల్తాన్‌పూర్‌, కుర్మల్‌గూడ, నాదర్‌గుల్‌ గ్రామాల్లో రైతు సంఘం నాయకులు పర్యటించి రైతులకు సభ్యత్వాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలను, క్రిమి సంహారక మందులను అరికట్టి రైతులకు సకాలంలో విత్తనా లు, ఎరువులు అందించాలన్నారు. రైతుల ఇబ్బందులను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ ప్రణాళికలు రూపొందించాలని కోరారు. రైతులకు రూ.2 లక్షల సంపూర్ణ రుణమాఫీ చేయాలన్నారు. ఫెర్టిలైజర్‌ యాప్‌తో యూరియా పంపిణీ రద్దు చేసి పంటపొలాలకు సరిపడా ఇవ్వాలని డిమాండ్‌ చేశా రు. భూ సర్వేకు దరఖాస్తులు ఇచ్చినా పట్టించుకునేవారే లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. 50ఏళ్లు నిండిన ప్రతీ రైతుకు పెన్షన్‌ సౌకర్యం కల్పించాలన్నారు. 906 ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ బాలాపూర్‌ మండల కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, రైతు సంఘం నాయకులు లక్ష్మారెడ్డి, కె.నరేందర్‌, జి.వేణు, మల్లారెడ్డి, బాలరాజు, రాజయ్య, యాదయ్య తదితరులున్నారు.

పార్టీ జిల్లా అధ్యక్షుడు

మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

మంచాల: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలోనే విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో పని చేసిందన్నారు. అందులో భాగంగా మోడల్‌స్కూల్స్‌(ఆదర్శ పాఠశాలలు), గురుకుల పాఠశాలలు, రెసిడెన్షియల్‌ పాఠశాలలను ఏర్పాటు చేసిందన్నారు. ప్రైవేట్‌ కాలేజీల్లో వైద్య విద్య కష్టంగా మారిందని పేదల కోసం జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విద్యావ్యవస్థను ధ్వంసం చేసిందని చెప్పడం హస్యాస్పందమన్నారు. ముఖ్యమంత్రి మెప్పునకు మాట్లాడడం అవగాహన రాహిత్యమే అన్నారు. ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వచ్చినా అభివృద్ధికి నయా పైసా నిధులు ప్రకటించక పోవడం శోచనీయమన్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి దిశగా పరుగులు తీస్తుందన్నారు.

బొంరాస్‌పేట: తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం వికారాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా కొత్తూరుకు చెందిన బాల్‌రాజ్‌ నియమితులయ్యారు. బుధవారం హైదరాబాద్‌లో అన్ని జిల్లాల ఇన్‌చార్జ్‌ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఉద్యమ కళాకారులకు ఉద్యోగ భద్రతపై చర్చించారు. తనను జిల్లా అధ్యక్షుడిగా నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement