డిప్లమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

డిప్లమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

Apr 22 2026 8:36 AM | Updated on Apr 22 2026 8:36 AM

డిప్లమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం వేదాద్రి ఆలయ అభివృద్ధికి చర్యలు ప్లీనరీని జయప్రదం చేయాలి 108 అంబులెన్స్‌ తనిఖీ

ఇబ్రహీంపట్నం రూరల్‌: సీ్త్ర, శిశు దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్‌ కళాశాలల్లో పలు డిప్లమా కోర్సులను అందివ్వనున్నట్లు జిల్లా సంక్షేమాధికారి శ్రీలత మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సివిల్‌ ఇంజినీరింగ్‌ (డీసీఈ), ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ (డీఈఈఈ), కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ (డీసీఎంఈ), ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ (డీఈసీఈ)లో డిప్లమా కోర్సులు చేయడానికి 60 సీట్లు ఉంటాయని తెలిపారు. ఇందులో అనాథలు, పాక్షిక అనాథలు, పేదవారు, ట్రాఫికింగ్‌కు గురైన అమ్మాయిలు, బాలికా సంరక్షణ కేంద్రంలోని అమ్మాయిల కోసం 70 శాతం సీట్లు (ఒక్కో కోర్సులో 42 సీట్లు) కేటాయించినట్టు చెప్పారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం 3 శాతం దివ్యాంగులకు కేటాయించబడతాయన్నారు. తెలంగాణ పాలిసెట్‌ పరీక్ష రాయకపోయినా పదో తరగతి ఉత్తీర్ణులైనవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వచ్చేనెల 25వ తేదీ లోపు కుల, ఆదాయ, బర్త్‌ సర్టిఫికెట్‌, బోనఫైడ్‌, టీసీ, స్టడీ సర్టిఫికెట్స్‌, పదో తరగతి మెమో అప్లికేషన్‌ ఫామ్‌తో జత చేసి జిల్లాలోని బాలరక్ష భవన్‌ సమర్పించాలని సూచించారు.

ఆమనగల్లు: తలకొండపల్లి మండలం వెల్జాలలో వెలసిన శ్రీ వేదాద్రి లక్ష్మీ నర్సింహాస్వామి ఆలయాన్ని మంగళవారం టూరిజం శాఖ ఇంజనీరింగ్‌ అధికారులు సందర్శించారు. ఆలయాభివృద్ధి కోసం టూరిజం శాఖ నుంచి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి రూ.మూడు కోట్లు మంజూరు చేయించారు. దీంతో చేపట్టాల్సిన పనుల గుర్తింపు కోసం టూరిజం శాఖ డీఈ హనుమంతరెడ్డి, ఏఈ నితీశ్‌, ఆర్కిటెక్చర్‌ గణేశ్‌ తదితరులు ఆలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త శ్రీనివాసమూర్తితో చర్చించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ వెంకట్‌రెడ్డి, సింగిల్‌విండో మాజీ చైర్మన్‌ అంజయ్యగౌడ్‌, నాయకులు నర్సింలు, అజీజ్‌, విష్ణువర్ధన్‌యాదవ్‌, ఆరీఫ్‌, అశోక్‌బాబు, శ్రీనివాస్‌గౌడ్‌, వడ్డె రాజు తదతరులు పాల్గొన్నారు.

షాబాద్‌: తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర ప్లీనరీని విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె వినయ్‌కుమార్‌, జిల్లా అధ్యక్షుడు ధార సత్యం పిలుపునిచ్చారు. మండల పరిధిలోని నాగర్‌గూడలో మంగళవారం పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఇన్‌చార్జి నాగని రామకృష్ణ (ఆర్కే) ఆధ్వర్యంలో నాగర్‌గూడ కూడలిలో వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్‌ కోదండరాం నాయకత్వాన్ని గుర్తు చేశారు. మే 12న హైదరాబాద్‌ జలవిహార్‌లో నిర్వహించే రాష్ట్ర ప్లీనరీకి తెలంగాణ ఉద్యమ కారులంతా కలిసి రావాలని కోరారు. ప్లీనరీలో రాష్ట్రంలోని ప్రధాన సమస్యలపై చర్చించి, భవిష్కత్‌ కార్యాచరణ రూపొందించనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్త రవి, కో–ఆర్డినేటర్‌ శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

మొయినాబాద్‌: 108 అంబులెన్స్‌ను ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంచాలని జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌ జాన్‌ షాహిద్‌ అన్నారు. మొయినాబాద్‌లోని 108 అంబులెన్స్‌ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. వాహనంలో ఉండాల్సిన అన్ని మెడిసిన్‌, ఇతర వస్తువుల స్టాక్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అత్యవసర సమయంలో 108 సిబ్బంది, అంబులెన్స్‌తో సహా అందుబాటులో ఉండాలన్నారు. సమాచారం అందిన వెంటనే స్పందించాలని 108 సిబ్బంది ఈఎంటీ శ్యామప్ప, పైలెట్‌ రాజేష్‌కు సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement