నిబంధనలకు తిలోదకాలు | - | Sakshi
Sakshi News home page

నిబంధనలకు తిలోదకాలు

Apr 22 2026 8:36 AM | Updated on Apr 22 2026 8:36 AM

నీడ లేక ఇబ్బంది

షాద్‌నగర్‌: నిబంధనల ప్రకారం పని ప్రదేశాల్లో కనీస వసతులు కల్పించాలి. కూలీలకు నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయడంతో పాటు మెడికల్‌ కిట్లు, తాగునీరు, మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి. కొన్ని గ్రామాల్లో మెడికల్‌ కిట్లు అందుబాటులో ఉంచుతున్నా.. చాలా గ్రామాల్లో అవి కనిపించడం లేదు. నీడ సౌకర్యం లేకపోవడంతో కూలీలు చెట్ల కిందనే సేద తీరుతున్నారు. గతంలో వేసవిలో చాలా మంది కూలీలు వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటనలు ఉన్నాయి. పని ప్రదేశాల్లో తాగునీరు సరిపడా లేకపోవడంతో నీరసం, డీహైడ్రేషన్‌ వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఎండలతో చర్మ సమస్యలు, అలసట, తలనొప్పి వంటివి ఎదురవుతున్నాయి.

ఎండ రోజురోజుకూ మండిపోతోంది. పని ప్రదేశాల్లో నీడ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు స్పందించి టెంటు ఏర్పాటు చేయాలి. తాగునీరు అందించాలి.

– భిక్షపతి, కూలీ, పాపిరెడ్డిగూడ, కేశంపేట మండలం

Advertisement
 
Advertisement
Advertisement