వ్యక్తి అరెస్ట్‌, సిలిండర్ల స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

వ్యక్తి అరెస్ట్‌, సిలిండర్ల స్వాధీనం

Apr 20 2026 9:29 AM | Updated on Apr 20 2026 9:29 AM

అక్రమ గ్యాస్‌ రీఫిల్లింగ్‌

పహాడీషరీఫ్‌: అక్రమంగా గ్యాస్‌ రీఫిల్లింగ్‌కు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పహాడీషరీఫ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి అతని వద్ద నుంచి డొమెస్టిక్‌ సిలిండర్‌, 3 చిన్న సిలిండర్లు, త్రాసు, గ్యాస్‌ ఫిల్లింగ్‌ పైపును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జల్‌పల్లి శ్రీరాంకాలనీ వినాయక కిరాణా దుకాణంలో అపురి రాజశేఖర్‌(55) గుట్టు చప్పుడు కాకుండా ఎలాంటి లైసెన్స్‌ లేకుండా అక్రమంగా గ్యాస్‌ రీఫిల్లింగ్‌కు పాల్పడుతున్నాడు. దీనిపై విశ్వసనీయమైన సమాచారం అందుకున్న పహడీషరీఫ్‌ పోలీసులు ఆదివారం దుకాణంపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రాజశేఖర్‌ను అరెస్ట్‌ చేసి అతని వద్ద నుంచి డొమెస్టిక్‌ సిలిండర్‌, 3 చిన్న సిలిండర్లు, త్రాసు, గ్యాస్‌ ఫిల్లింగ్‌ పైపును స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా గ్యాస్‌ రిఫిల్లింగ్‌కు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement