హుజూరాబాద్: శాకాహారం తీసుకుంటే అన్ని పోషకాలు అందుతున్నాయని భావించకూడదు. రోజువారీ ఆహారంలో పప్పులు, ఆకుకూరలు, చిరుధాన్యాలు ఉండాలి. శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, ఐరన్, కాల్షియం, విటమిన్ బి12 అందేలా చూసుకోవాలి. పూర్తిగా జంతు సంబంధిత ఆహారం మానేసినవారు విటమిన్ బి12 విషయంలో శ్రద్ధ వహించాలి. అవసరమైతే వైద్యుల సలహాతో పరీక్షలు, సప్లిమెంట్లు తీసుకోవాలి.
– రావుల సుజాత, డైటీషియన్,
ప్రభుత్వ ఆస్పత్రి, హుజూరాబాద్


