‘ఆది’పై ఆరోపణలు మానుకోవాలి | - | Sakshi
Sakshi News home page

‘ఆది’పై ఆరోపణలు మానుకోవాలి

Nov 1 2026 12:33 AM | Updated on Nov 1 2026 12:33 AM

సిరిసిల్లటౌన్‌: బీఆర్‌ఎస్‌ నేతలు ఆది శ్రీనివాస్‌పై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు హితవు పలికారు. శనివారం డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్లో ఆయన మాట్లాడారు. కేటీఆర్‌ను సిరిసిల్ల ప్రజలు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే వారి సమస్యలు పట్టించుకోకుండా హైదరాబాద్‌కే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఎస్సీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి ఆకునూరి బాలరాజు, గోలి వెంకటరమణ, నీలి రవీందర్‌, నేదురి లక్ష్మణ్‌, శ్రీరాముల వెంకటేశం, గోనె ఎల్లప్ప, రాగుల జగన్‌, బూట్ల నవీన్‌, కంసాల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

120 నాటుకోళ్లు మృతి

– రూ.లక్ష పెట్టుబడి నష్టం

వీర్నపల్లి: రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రానికి చెందిన రైతు తౌటు అశోక్‌కు చెందిన నాటుకోళ్లు జంగపిల్లి దాడిలో చనిపోయాయి. ఈ ఘటనతో రైతుకు రూ.లక్ష వరకు నష్టం జరిగింది. బాధితుడు తెలిపిన వివరాలు. వీర్నపల్లికి చెందిన రైతు అశోక్‌ తనకున్న 1.20 ఎకరాల్లో పంటలు సాగుచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న అశోక్‌ అదనపు ఆదాయం కోసం కోళ్ల పెంపకం చేపట్టాడు. పది నెలల క్రితం రూ.67వేలు పెట్టి 120 డేగ జాతి నాటుకోళ్లను కొనుగోలు చేశాడు. వాటి కోసం షెడ్డు, ఇతర సదుపాయాలకు మరో రూ.33 వేలకు పైగా వెచ్చించాడు. అప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం కోళ్లు గుడ్లు పెట్టే దశకు చేరుకున్నాయి. శనివారం ఉదయం షెడ్డు వద్దకు వెళ్లి చూడగా కోళ్లు చనిపోయి కనిపించాయి. జంగపిల్లి దాడి చేయడంతోనే తాను పెంచుతున్న 120 కోళ్లు చనిపోయాయని రోదిస్తూ తెలిపాడు. దాదాపు రూ.లక్షకు పైగా నష్టపోయానని ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement