నిజామాబాద్‌అర్బన్: దంపతులపై దాడి చేసిన కేసులో ఇద్దరు నిందితులను నిజామాబాద్ ఒకటో టౌన్ పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ తెలిపిన వివరాలు. నిజామాబాద్ నగరానికి చెందిన దంపతులు రెండు రోజుల క్రితం బోధన్‌రోడ్‌లోని ఫిష్ మార్కెట్ వద్ద నిలబడి ఉన్నారు. అదే సమయంలో ఓ ఆటో వేగంగా రావడంతో నెమ్మదిగా వెళ్లాలని సూచించారు. దీంతో ఆటోలో ఉన్న డ్రైవర్ కమ్మరి రాజు, రామంచ విష్ణు రాడ్‌తో దాడి చేసి పారిపోయారు. దంపతుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను మోపాల్ మండలం మంచిప్పకు చెందిన కమ్మరి రాజు, కామారెడ్డికి చెందిన రామంచ విష్ణుగా గుర్తించి శనివారం అరెస్ట్ చేశారు. కమ్మరి రాజుపై గతంలో కరీంనగర్ టూ టౌన్, గంగాధర, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్, జగిత్యాల జిల్లా మెట్‌పల్లి, కమ్మర్‌పల్లి, కామారెడ్డి, ఆర్మూర్, మోపాల్ నిజామాబాద్ వన్ టౌన్ పరిధిలో వాహనాల చోరీ కేసులు ఉన్నాయి. రామంచ విష్ణుపై నిజామాబాద్ వన్ టౌన్, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ నాలుగో టౌన్, కామారెడ్డి జిల్లా సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో చోరీ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. నిందితులు ఉపయోగించిన ఆటో సైతం అపహరించినదేనని తెలిపారు.
మానవత్వం చాటుకున్న పోలీసులు
ఎల్లారెడ్డిపేట: మండలంలోని మొదటి బైపాస్ రోడ్డుపై ఓ మహిళకు ఫిట్స్ రావడంతో రోడ్డుపై కుప్పకూలింది. విధి నిర్వహణలో ఉన్న బ్లూకోల్ట్స్ పోలీస్ కానిస్టేబుల్ ప్రశాంత్, హోంగార్డు శ్రీనివాస్‌చారి గమనించి ప్రథమ చికిత్స అందించారు. పోలీస్ సిబ్బందిని ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో ఎస్సై రమేశ్‌గౌడ్, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు నిమ్మ బాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బుర్క బాబ్జీ, సభ్యులు ఎదురుగట్ల ముత్తయ్య, కొండ్లేప్ జగదీష్, కందుకూరి రవి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


