సిరిసిల్లటౌన్: తమపై చేసిన తప్పుడు ఫిర్యాదుపై విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరుతూ సిరిసిల్లలోని మూడో వార్డుకు చెందిన రాగిపెల్లి విజయ, కుటుంబ సభ్యులు మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషాను కోరారు. ఈమేరకు శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు. విజయ మాట్లాడుతూ విద్యానగర్‌లో తనకు ఉన్న ఖాళీస్థలంలో ఇల్లు నిర్మించుకోవడం కోసం దరఖాస్తు చేసుకోగా ఇందిరమ్మ ఇల్లు కేటాయించారని పేర్కొంది. ఈక్రమంలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు ఒకరు తనకు మూడు ఇల్లు ఉన్నాయని చేసిన ఫిర్యాదుతో అధికారులు ఇల్లు మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి తనకు న్యాయం చేయాలని వేడుకుంది.
విచారణ చేపట్టండి.. మున్సిపల్ చైర్‌పర్సన్
తప్పుడు ఫిర్యాదులను లెక్కలోకి తీసుకొని బాధితులకు అన్యాయం చేయడం ఏంటని మున్సిపల్ కమిషనర్‌ను చైర్‌పర్సన్ జిందం కళ శనివారం నిలదీశారు. తన చాంబర్‌లో కమిషనర్‌తో కౌన్సిలర్ల సమక్షంలో మాట్లాడారు. తన వార్డుకు చెందిన రాగిపెల్లి విజయ ఇందిరమ్మ ఇంటికి అన్ని విధాలా అర్హురాలుగా పేర్కొంది. ఆమైపె గిట్టని వారు మూడు బంగ్లాలున్నాయని ఫిర్యాదు చేస్తే ఇందిరమ్మ ఇల్లును ఎలా నిలిపేస్తారని ప్రశ్నించారు. కమిషనర్ స్పందిస్తూ..ఎవరి ఇండ్ల మంజూరిని ఆపలేదని తమకు వచ్చిన ఫిర్యాదులపై హౌసింగ్ ఏఈతో విచారణ చేపిస్తున్నట్లు వివరించారు.


