సిరిసిల్లటౌన్/వేములవాడ: కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని కోరుతూ బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ శనివారం సిరిసిల్ల నుంచి వేములవాడకు పాదయాత్ర చేపట్టారు. వేములవాడ భీమేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని, తిరిగి ముఖ్యమంత్రి కావాలని మొక్కుకున్నట్లు చెప్పారు. పాదయాత్రలో బీఆర్ఎస్వీ నాయకులు మట్టి శ్రీనివాస్, సదుల శేఖర్, కల్యాడపు వినయ్, గజుల రిష్విత్, బసాని అనీశ్కుమార్, కసర్ల మణిశర్మ, కోయేటి జశ్వంత్, కంకనాల సాయితేజ, తన్నీరు నవనీత్, కంభోజి హర్షిత్, అన్నాడి సాత్విక్, చిలువేరి రాంచరణ్ పాల్గొన్నారు. రాజన్న గుడి ముందుకు చేరుకున్న పాదయాత్రకు స్థానిక బీఆర్ఎస్ నాయకులు నిమ్మశెట్టి విజయ్, మారంకుమార్, మంత సందీప్, బొల్లం దేవరాజు, మామిండ్ల కనకయ్య, నిమ్మశెట్టి రాజు, మిర్యాల సంతోష్, అంజాత్పాషా, నరాల దేవేందర్, సాయి, గోపు మధు, ఆసద్, చి ట్యాల విజయ్, పర్వేజ్లు సంఘీభావం తెలిపారు.


