● చందుర్తి సీఐ రవీందర్
చందుర్తి: అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని యూరిన్ కిట్ల ద్వారా గంజాయి పరీక్షలు నిర్వహించగా పాటిజిట్ రావడంతో కేసు నమోదు చేసినట్లు చందుర్తి సీఐ రవీందర్ తెలిపారు. చందుర్తి సర్కిల్ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్ల డించారు. చందుర్తి మండలం సనుగుల గ్రామానికి చెందిన యువకుడు, వేములవాడ మండలం మారుపాకకు చెందిన ఇద్దరు యువకులు గంజాయి సేవించారు. మండలంలోని సనుగుల శివారులో తిరుగుతుండగా ముగ్గురిని అదుపులోకి తీసుకుని గంజాయి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ రవీందర్ వివరించారు.


