ఉన్నత లక్ష్యాలతో చదవాలి | - | Sakshi
Sakshi News home page

ఉన్నత లక్ష్యాలతో చదవాలి

Oct 30 2026 12:03 AM | Updated on Oct 30 2026 12:03 AM

సిరిసిల్ల: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో పట్టుదలగా చదవాలని సిరిసిల్ల రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి గడ్డం మేఘన కోరారు. స్థానిక గీతానగర్‌ బాలికల జెడ్పీ హైస్కూల్‌లో బాలల హక్కులపై అవగాహన కల్పించేందుకు గురువారం ‘సురక్షిత్‌ బచ్‌పన్‌ అభియాన్‌’ నిర్వహించారు. మేఘన మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదల, క్రమశిక్షణతో నిరంతరం కృషిచేయాలన్నారు. పోక్సో చట్టం ప్రకా రం పిల్లలపై లైంగిక వేధింపులు, అనుచిత ప్రవర్తనకు సంబంధించిన సంఘటనలు జరిగినప్పుడు వాటిని నిర్భయంగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూ చించారు. బాధితు ల వ్యక్తిగత వివరాల గోప్యతను కాపాడాలన్నారు. స్కూల్‌ ఇన్‌చార్జి హెడ్‌ మాస్టర్‌ ఎం.తిరుపతి, లోక్‌ అదాలత్‌ స భ్యులు చింతోజు భాస్కర్‌, న్యాయవాదులు ఆడెపు వేణు, కళ్యాణి, కుంట శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ప్రమాద బాధితులకు నగదు రహిత వైద్యసేవలు

సిరిసిల్ల: జిల్లాలో రోడ్డు ప్రమాదాల బాధితులకు నగదు రహిత వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని, ఏడు ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందిస్తారని ఎస్పీ మహేశ్‌ బీ గీతే గురువారం తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా.. ఎప్పుడైనా.. రోడ్డు ప్రమాదాలు జరిగితే.. గాయపడిన బాధితులకు సకాలంలో వైద్యచికిత్స అందించి, వారి ప్రాణాలను కాపాడే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం రహత్‌(పీఎం ఆర్‌ఏహెచ్‌టీ) పథకంపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లా పరిధిలో ఏడు ఆస్పత్రుల్లో ఈ పథకం అమలులో ఉందన్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు అర్హతలు, నిబంధనలకు అనుగుణంగా రూ.1.50 లక్షల వరకు ఏడు రోజులపాటు నగదు రహిత వైద్యం పొందవచ్చని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి, అత్యవసర చికిత్స అందేలా సహకరించాలని కోరారు. రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి ప్రజలు ముందుకు రావాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్‌ చేసి పోలీసుల సహాయం పొందాలని తెలిపారు.

శ్రీవారి ఆదాయం రూ.10.69 లక్షలు

సిరిసిల్లటౌన్‌: శ్రీశాల శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని గురువారం దేవాదాయ శాఖ అధికారులు లెక్కించారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల ఆదాయం రూ.10,69,437 వచ్చిందని ఆలయ ఈవో మారుతిరావు ప్రకటించారు. ఈవో మాట్లాడుతూ గతేడాది కంటే ఈ యేడు ఆదాయం అధికంగా వచ్చిందన్నారు. హుండీ ద్వారా రూ.4,31,287, రథంపై దర్శనం టికెట్లు రూ.3,45,710, కొబ్బరి ముక్కలు రూ.33వేలు, లడ్డూ, పులిహోర ప్రసాదాలు రూ.2,59,440 వచ్చినట్లు వివరించారు. గతేడాది రూ.8,17,608 రాగా ఈ సంవత్సరం రూ.2,51,829 అధికంగా వచ్చిందని తెలిపా రు. డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, ఏఈవోలు పీసరి రవీందర్‌, కూనబోయిన సత్యం, ఆలయ మాజీ చైర్మన్లు ఉప్పుల విఠల్‌రెడ్డి, చేపూరి నాగరాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement