కొత్తబోర్లకు అనుమతి తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

కొత్తబోర్లకు అనుమతి తప్పనిసరి

Oct 30 2026 12:03 AM | Updated on Oct 30 2026 12:03 AM

తాగునీటి అవసరాలకే బోర్లు వేయాలి ఇందిరమ్మ ఇళ్లను వేగంగా పూర్తి చేయాలి ఆయిల్‌పామ్‌ సాగు పెంచాలి కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

సిరిసిల్ల: జిల్లాలో వాల్టా చట్టం ప్రకారం కొత్త బోర్లు వేసేందుకు తహసీల్దార్‌ వద్ద అనుమతి తీసుకోవాలని బోర్‌వెల్‌ యజమానులను కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం భూగర్భ జలశాఖ ఆధ్వర్యంలో బోర్‌వెల్‌ యజమానులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సూపర్‌ ఎల్‌నినో నేపథ్యంలో భూగర్భ జలాలు తగ్గిపోతున్న నేపథ్యంలో తాగునీటి అవసరాలకే బోర్లు వేయాలన్నారు. బోర్‌వెల్‌ యజమానులు భూగర్భ జలశాఖ వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని ఆదేశించారు. భూగర్భ జల శాఖ డీడీ నాగరాజు, డీఏవో అఫ్జల్‌బేగం, కలెక్టరేట్‌ పర్యవేక్షకులు వైశాలి పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్లు వేగంగా పూర్తి చేయండి

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయించాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, హౌసింగ్‌ ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. జిల్లాలో ఇప్పటి వరకు 6,465 ఇళ్లకు ముగ్గు పోశామని, 5,479 ఇళ్లు బేస్మెంట్‌ లెవెల్‌, 4,858 ఇళ్లు గోడల లెవెల్‌, 4,585 స్లాబ్‌, 3,934 పూర్తయ్యాయని వివరించారు. ఉత్తమ పనితీరు ప్రదర్శించిన బోయినపల్లి, ఇల్లంతకుంట మండలాల అధికారులను కలెక్టర్‌ అభినందించారు. ఇన్‌చార్జి హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఖాజా ముజాఫరొద్దీన్‌, ఇన్‌చార్జి డీపీవో వీరభద్రయ్య పాల్గొన్నారు.

ఆయిల్‌పామ్‌తో దీర్ఘకాలిక ఆదాయం

ఆయిల్‌పామ్‌ సాగు ద్వారా రైతులకు దీర్ఘకాలిక ఆదాయం వస్తుందని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ పేర్కొన్నారు. ఉద్యానశాఖ, ప్రి–యూనిక్‌ కంపెనీ, డ్రిప్‌ కంపెనీల ప్రతినిధులతో ఆయిల్‌పామ్‌ సాగుపై కలెక్టర్‌ సమీక్షించారు. జిల్లాలో 3,018 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగైందని, 1,076 ఎకరాల్లో 1,743 టన్నుల పంట దిగుబడితో రైతులకు రూ. 3.78 లక్షల ఆదాయం సమకూరిందని అధికా రులు వివరించారు. జిల్లా ఉద్యానవన శాఖ అధి కారి ఆర్‌.శరత్‌బాబు, డీఏవో అఫ్జల్‌బేగం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement