రాజన్న క్షేత్రానికి కొత్త మెరుపులు
రూ.47 కోట్లతో భూసేకరణ
రూ.6.50 కోట్లతో డబుల్ రోడ్డు పనులు
రూ.2.50 కోట్లతో ఆధ్యాత్మిక సుందరీకరణ
వేములవాడ: ఆధ్యాత్మిక పట్టణం.. దక్షిణకాశీ.. అభివృద్ధికి జాడగా నిలుస్తోంది. ఇటీవల చేపట్టిన పనులతో వేములవాడ రూపురేఖలు మారిపోతున్నాయి. మూలవాగు బ్రిడ్జి నుంచి ప్రధాన ఆలయం వరకు 80 ఫీట్ల రోడ్డు, రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు, బద్దిపోచమ్మ గడి అభివృద్ధి పనులతో ఆధ్యాత్మికాభివృద్ధి చెందుతోంది.
రూ.47 కోట్లతో భూసేకరణ
రోడ్డు విస్తరణకు ప్రభుత్వం రూ.47 కోట్ల భారీ మొ త్తాన్ని కేటాయించి భూసేకరణ పూర్తి చేసింది. రాజన్న గుడి నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు రూ.6.50 కోట్లతో డబుల్ రోడ్డు పనులను వేగవంతంగా చేపట్టింది. గతంలో ట్రాఫిక్ జామ్‌లతో నిత్యం ఇబ్బందులు పడ్డ భక్తులు, స్థానికులకు ఇ ప్పుడు విశాలమైన రోడ్డు స్వాగతం పలుకుతుంది.
రూ.2.50 కోట్లతో ఆధ్యాత్మిక వెలుగులు
80 ఫీట్ల రోడ్డుకు మరింత అందం అద్దేందుకు రూ.2.50 కోట్లతో అత్యాధునిక సెంట్రల్ లైటింగ్, విద్యుత్ స్తంభాలపై నంది, త్రిశూలం, ఢమరుకం ఆకారాల్లో లైట్లను బిగించనున్నారు. త్వరలోనే ఈ రోడ్డును ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


