సిరిసిల్లటౌన్: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు గురువారం ధర్నా చేపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ఆఫీస్ ఎదుట బైఠాయించారు. నవంబర్ 5 నుంచి పనులు బంద్ చేసి సమ్మె చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్‌లో పనిచేస్తూ చనిపోయిన, 60 ఏళ్లు పైబడి రిటైర్మెంట్ పొందిన కార్మికుల స్థానాల్లో వారి కుటుంబ సభ్యులను వెంటనే పనిలో పెట్టుకోవాలని కోరారు. 2009 నుంచి 2012 వరకు పెండింగ్‌లో ఉన్న ఈపీఎఫ్ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు కమిషనర్ ఎం.ఎ.ఖదీర్‌పాషాకు వినతిపత్రం అందజేశారు. నాయకులు కోడం రమణ, మూశం రమేశ్, సూరం పద్మ, కోల శ్రీనివాస్, కాసర్ల శంకర్, దేవరాజు, బాబా కిషన్, విజయ, ఉమ, లక్ష్మి, భారతి, ఏసవ్వ, శ్రీనివాస్, మల్లేశం పాల్గొన్నారు.


