కోనరావుపేట: తమ గ్రామంలో ఇసుకరీచ్ రద్దు చేయాలని మామిడిపల్లి రైతులు గురువారం ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనతో వందలాది ట్రాక్టర్లు నిలిచిపోయాయి. మాజీ సర్పంచ్ బడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ కనగర్తి రీచ్ పేరిట డీడీలు చె ల్లించి మామిడిపల్లి శివారులోని బావుల వద్ద ఇసుక తవ్వుతున్నారన్నారు. మామిడిపల్లి, కనగర్తి గ్రామాల సరిహద్దు ఏర్పాటు చేయాలని కోరుతు న్నా అధికారులు పరిష్కరించడం లేదన్నారు. తహసీల్దార్ వరలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, ఎస్సై రామ్మోహన్, ఆర్‌ఐ సంతోష్ చేరుకుని రైతులతో మాట్లాడడంతో శాంతించారు. ఎల్లయ్య, సుదర్శన్‌రెడ్డి, మల్లేశం, బాపురావు, బాబు, శంకర్, గంగయ్య, లింబయ్య పాల్గొన్నారు.


