ఎల్లారెడ్డిపేట: ఈ సీజన్‌లో రైతులకు ఇబ్బందుల్లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని జిల్లా సహకార అధికారి టి.రామకృష్ణ, సింగిల్‌విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి కోరారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయంలో మూడు సహకార సంఘాల పరిధిలోని కేంద్రాల ఇన్‌చార్జీలు, ట్యాబ్ ఆపరేటర్లు, సిబ్బందికి గురువారం అవగాహన కల్పించారు.
కృత్రిమ మేథస్సుపై అవగాహన
గంభీరావుపేట: ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో గురువారం విద్యార్థులకు కృత్రిమ మేథస్సుపై అవగాహన కల్పించారు. ఏఐ వినియోగం, డిజిటల్ నైపుణ్యాలు, భవిష్యత్‌లో ఉపాధి అవకాశాల గురించి అవగాహన కల్పించారు. ఏఐఎస్‌ఈసీటీ ప్రతి నిధి సంపత్‌కుమార్, వైస్ ప్రిన్సిపాల్ ప్రభాకర్, కెరీ ర్ గైడెన్స్ సెల్ కన్వీనర్ శ్రావణ్‌కుమార్ ఉన్నారు.


