వ్యవసాయ మార్కెట్‌లకు పాలకవర్గాలు | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయ మార్కెట్‌లకు పాలకవర్గాలు

Oct 29 2026 12:18 AM | Updated on Oct 29 2026 12:18 AM

ముస్తాబాద్‌/వీర్నపల్లి: ముస్తాబా ద్‌ మండలం పోత్గల్‌, వీర్నపల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు పాలకవర్గాలను ప్రభుత్వం బుధ వారం నియమించింది. పోతుగల్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా మండల కేంద్రానికి చెందిన అరుట్ల మహేశ్‌కుమార్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీచేసింది. మహేశ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌లో సీనియర్‌ నాయకుడు. వైస్‌చైర్మన్‌గా గూడెంకు చెందిన సడిమెల బాలయ్య, డైరెక్టర్లుగా గూడ సిద్ధారెడ్డి, అనమేని రాజు, గోవర్ధన్‌, పోచమ్మల వనిత, సద్ది మధు, గంత రాజు, ముక్క నర్సింలు, బత్తుల నవీన్‌, ఊరడి ప్రశాంత్‌, డాకూరి మహేందర్‌, కుంబాల యాదగిరిరెడ్డి, చేపూరి రమేశ్‌లను నియమించారు.

వీర్నపల్లి చైర్‌పర్సన్‌గా మమత

వీర్నపల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మూడో పాలకవర్గాన్ని ప్రభుత్వం ప్రకటించింది. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవిని మహిళలకు కేటాయించగా, బంజేరుకు చెందిన అర్రోళ్ల మమతను చైర్‌పర్సన్‌గా, అడవిపదిరకు చెందిన పని శివరామకృష్ణను వైస్‌ చైర్మన్‌గా నియమించింది. మార్కెట్‌ కమిటీ పాలకవర్గంలో డైరెక్టర్లుగా మల్లారపు దేవయ్య, ధార్ల సుమలత, భూక్య హన్మంతు, భూక్య లింగం, గంగిపెల్లి ఈస్తారి, సుతారి దేవరాజు, భూక్య విట్టల్‌, భూక్య దేవేందర్‌ దేవుల, జోగినిపల్లి మల్లేశం, గుమ్మడి రాజేశంలను నియమించింది.

మహేశ్‌

కుమార్‌రెడ్డి

అర్రోళ్ల

మమత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement