ఆలకించండి..ఆదుకోండి | - | Sakshi
Sakshi News home page

ఆలకించండి..ఆదుకోండి

Oct 27 2026 1:14 AM | Updated on Oct 27 2026 1:14 AM

● కలెక్టరేట్‌ బాట పట్టిన బాధితులు ● సమస్యల పరిష్కారానికే ప్రజావాణి ● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

● కలెక్టరేట్‌ బాట పట్టిన బాధితులు ● సమస్యల పరిష్కారానికే ప్రజావాణి ● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

సిరిసిల్ల అర్బన్‌: మండలాల్లో ప్రజావాణి నిర్వహిస్తున్నా చాలా మంది బాధితులు కలెక్టరేట్‌కు తరలివస్తున్నారు. ఏళ్లుగా సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడంతో కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తే తీరుతుందనే ఆశతో వస్తున్నారు. తమ సమస్యను ఆలకించి.. ఆదుకోండి అని కోరుతున్నారు. వివిధ సమస్యలపై బాధితుల నుంచి కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ 163 దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికే ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవో కార్యాలయాల్లోని ప్రజావాణికి 9 దరఖాస్తులు, మండల పరిషత్‌లలో 31 అర్జీలు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement