సిరిసిల్ల: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బందికి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ‘ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసుల నుంచి ప్రజలు ఎలాంటి సేవలు ఆశిస్తారు’, ‘పోలీసు అధికారుల జీవితాల్లో సోషల్ మీడియా పాత్ర ఏమిటి’, ‘సోషల్ మీడియాకు బానిస కాకుండా వ్యక్తిగత, సామాజిక ప్రయోజనాల కోసం సద్వినియోగం చేసుకోవడం ఎలా’ అనే అంశాలపై డీపీవో ఆఫీస్‌లో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కానిస్టేబుల్ నుంచి అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్(ఏఎస్‌ఐ) హోదా వరకు ఉన్న సివిల్, ఏఆర్ పోలీస్ సిబ్బందికి వ్యాసరచనకు అవకాశం కల్పించారు. రెండో విభాగంలో భాగంగా సబ్‌ఇన్‌స్పెక్టర్(ఎస్‌ఐ), రిజర్వ్ సబ్‌ఇన్‌స్పెక్టర్(ఆర్‌ఎస్‌ఐ), ఆపై హోదాలోని అధికారులకు పౌరుల నుంచి గౌరవం, ఆదరణ, సద్భావన పొందేందుకు పోలీసులు ఎలాంటి కృషి చేయాలి, క్షేత్రస్థాయిలో పోలీసింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం ఎలా.. అనే అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు.


