గోదావరిఖని: గోదావరి నది స మ్మక్క– సారలమ్మ గద్దెల వద్ద శుక్రవారం స్నేహితులతో సరదాగా ఈతకని వెళ్లి మేదరిబస్తీ కి చెందిన గోపి పవన్ (34) మృతి చెందాడు. తిలక్‌నగర్‌కు చెందిన(ప్రస్తుతం మేదరిబస్తీలో నివాసం) గోపిపవన్ ప్రైవేట్ డ్రైవర్. తన స్నేహితులైన కుంభాల సందీప్, బోరం రంజిత్, తుంగపల్లి సాయికుమార్‌తో కలిసి శుక్రవారం గోదావరినదికి వెళ్లి మద్యం తాగారు. అనంతరం సాయికుమార్, సందీప్ కలిసి గోపిపవన్ ఈత కొట్టేందుకు గోదావరినదిలోకి దిగారు. ఈతరాకపోవటంతో గోపిపవన్ నదిలో మునగగా సాయికుమార్, రంజిత్ నీటినుంచి పైకి తీశారు. అనంతరం రంజిత్ సీపీఆర్ చేయగా అప్పటికే గోపిపవన్ మృతి చెందాడు. మృతుడికి ఆరె నెలల క్రితమే భార్యతో విడాకులయ్యాయి. మృతుడి తల్లి గోపి రాజేశ్వరి ఫిర్యాదు మేరకు వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేసుకొన్నారు.


