సిరిసిల్లలో జమ్మిగద్దెకు తరలివచ్చిన స్వామి వారు, ప్రజలు
బాణం సంధించిన నాయకులు
వేములవాడలో సేవలపై స్వామివారు
సిరిసిల్లటౌన్/వేములవాడ: కార్మికక్షేత్రంలో దసరా వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల మానేరువాగు ఒడ్డున రాంలీల మైదానంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రావణ సంహారం నిర్వహించారు. 20 అడుగుల ఎత్తులో రావణాసురుడి ప్రతిమను మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ, ముఖ్య అతిథుల చేతుల మీదుగా దహనం చేశారు. సర్ దేశాయ్ చెన్నమనేని శ్రీనివాస్‌రావు, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు చేపూరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మేర్గు సత్యం, గౌరవ అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్, గాజుల వేణు, చేపూరి అశోక్ తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి భక్తులకు శమీ దర్శనం కల్పించారు. అశ్వవాహనంపై స్వామివారు మానేరువాగు తీరాన ఉన్న జమ్మిచెట్టు వద్దకు చేరుకోగా.. శమీపూజ జరిగింది. వేలాదిసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, ఆలయ మాజీ చైర్మన్లు ఉప్పుల విఠల్‌రెడ్డి, చేపూరి నాగరాజు, తీగల శేఖర్‌గౌడ్, ఈవో మారుతిరావు, ఏఈవోలు పీసరి రవీందర్, కూనబోయిన సత్యం పాల్గొన్నారు.
వేములవాడలో
వేములవాడలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించా రు. ఆలయంలో పూజల అనంతరం అంబారిసేవలను పురవీధుల్లో శమీయాత్ర నిర్వహించారు. మహాలక్ష్మి ఆలయం వద్దనున్న జంబిచెట్టుకు పూజలు చేశారు. రాత్రి 9 గంటలకు జరిగిన నిషిపూజ, ఏకాంతసేవలతో ఉత్సవాలు ముగిసినట్లు ఇన్‌చార్జి స్థానాచార్యులు ఉమేశ్‌శర్మ తెలిపారు. విప్ ఆది శ్రీని వాస్, ఈవో రమాదేవి, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్‌చైర్మన్ నరాల శేఖర్, కమిషనర్ లోకేశ్ తదితరులు పాల్గొన్నారు.


