ఇది సిరిసిల్ల పట్టణంలోని తారకరామానగర్ ఏరియా. ఇక్కడ వీధి వ్యాపారుల కోసం మున్సిపల్ అధికారులు 16 షాపులను ఏర్పా టు చేశారు. పేద వీధి వ్యాపారులు ఇక్కడి షాపుల్లో వ్యాపారం చేసుకుంటూ ఉపాధి పొందాలని రూ.93లక్షలతో నిర్మించారు. పర్యావరణ హితమైన ఏకో ఫ్రెండ్లీ రేకులు, సామగ్రితో 2019లో నిర్మించగా, అప్పటి నుంచి నిరుపయోగంగానే ఉన్నాయి.
ఇది సిరిసిల్ల శివనగర్ పార్క్ వద్ద వీధి వ్యాపారుల కోసం నిర్మించిన ఏకో ఫ్రెండ్లీ దుకా ణాల సముదాయం. నిర్మించినప్పటి నుంచి దుకాణాలు నిరుపయోగంగానే ఉన్నాయి. ఇలా సిరిసిల్లలో రూ.1.93కోట్లతో మొత్తం 60 షాపులు ఏకో ఫ్రెండ్లీ దుకాణాల సముదాయాలను నాలుగు ప్రదేశాల్లో నిర్మించగా.. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్ద, రైతుబజారు వద్ద షాపులు వినియోగంలో ఉండగా.. మిగతావి వృథాగా పడి ఉన్నాయి.


