● నారాయణపురం.. సర్వే తీరుపై అధ్యయనం
సాక్షి, మహబూబాబాద్: భూమి హక్కును కోల్పోయి పదేళ్లు ఇబ్బందులు పడిన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామరైతుల సమస్యను ప్రభుత్వం ధరణి స్థానంలో భూ భారతి చట్టం తీసుకొచ్చి ప్రతీ అంగుళాన్ని సర్వే చేసి రైతులకు పట్టాలు పంపిణీ చేసింది. సర్వే చేయడంలో మెలకువలు, సాఫీగా చేయడం ఎలా అని తెలుసుకునేందుకు రాజన్నసిరిసిల్ల జిల్లా అధికారులు శనివారం మహబూబాబాద్కు వచ్చారు. గంభీరావుపేట, చందుర్తి మండలాల సమస్యల నివృత్తికి ఆర్డీవో, సర్వే ఏడీ, తహసీల్దార్లు, సర్వేయర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ అనిల్కుమార్తో సమావేశమయ్యారు. సిరిసిల్ల ఆర్డీవో డి.శ్రీనివాస్ మాట్లాడుతూ ‘నారాయణపురంలో రీసర్వే చేసిన తీరు రాష్ట్రానికే ఆదర్శం. జిల్లాలో జరుగుతున్న రీ సర్వేను నేరుగా పరిశీలించాం. మాకు తలెత్తిన సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలుసుకున్నాం. ఇక్కడి అధికారులు మా బృందానికి అన్ని విధాలుగా సహకరించారు. ప్రతీ విషయాన్ని వివరించారు.’ అని తెలిపారు.


