చలో హైదరాబాద్‌ జయప్రదం చేయండి | - | Sakshi
Sakshi News home page

చలో హైదరాబాద్‌ జయప్రదం చేయండి

Oct 18 2026 1:54 AM | Updated on Oct 18 2026 1:54 AM

● సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ ● కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు

● సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ

సిరిసిల్ల అర్బన్‌: కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 25, 26 తేదీల్లో ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ కోరారు. సిరిసిల్లలోని సీఐటీయూ కార్యాలయంలో ధర్నా పోస్టర్లను ఆవిష్కరించారు. గుర్రం అశోక్‌, సూరం పద్మ, నక్క దేవదాస్‌, సిరిమల్ల సత్యం తదితరులు పాల్గొన్నారు.

ఎండిన పొలంలో ఉరితాళ్లతో నిరసన

ఇల్లంతకుంట మండలంలో కరెంటు కోతలతో వరి పొలాలు ఎండిపోతున్నాయని టీఆర్‌ఎస్‌ మానకొండూరు నియోజకవర్గం ఇన్‌చార్జి చెన్నమల్ల చైతన్య ఆరోపించారు. ఇల్లంతకుంట మండలం వల్లంపట్లలో శనివారం విద్యుత్‌ కోతలతో ఎండిన వరి పొలంలో రైతులతో కలిసి ఉరితాళ్లతో నిరసన తెలిపారు. టీఆర్‌ఎస్‌ మండల ఇన్‌చార్జి నాయకుడు ఒల్లాల శ్రీనివాస్‌, రైతులు పాల్గొన్నారు.

గత ప్రభుత్వంలోనే అక్రమాలు జరిగాయి

సిరిసిల్ల అర్బన్‌: గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే అవినీతి, అక్రమాలు జరిగాయని కాంగ్రెస్‌ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు ఆరోపించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో రైతులు నష్టపోకుండా ప్రభుత్వం ముందస్తుగా అవగాహన కల్పిస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని, సెస్‌ పరిధిలో నిధుల దుర్వినియోగమైనట్లు ఆడిట్‌లో వెల్లడైందని పేర్కొన్నారు. ఆకునూరి బాలరాజు, బొప్ప దేవయ్య, గాజుల నరేశ్‌, పత్తిపాక లక్ష్మీరాజం, వెంగళ అశోక్‌, రాగుల జగన్‌, బూర యాదగిరి, లక్ష్మణ్‌, అనిల్‌, సాగర్‌, ప్రకాశ్‌, సత్యనారాయణ పాల్గొన్నారు.

ఇన్‌చార్జి డీపీఆర్వోగా లక్ష్మణ్‌కుమార్‌

సిరిసిల్ల: జిల్లా ఇన్‌చార్జి పౌరసంబంధాల అధికారి(డీపీఆర్వో)గా (కరీంనగర్‌ ఏడీ) లక్ష్మ ణ్‌కుమార్‌ శనివారం కలెక్టరేట్‌లో బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందించారు. ఐఅండ్‌ పీఆర్‌ స్పెషల్‌ కమిషనర్‌ ఆదేశాలతో డీపీఆర్వోగా లక్ష్మణ్‌కుమార్‌ విధుల్లో చేరారు.

పురాతన ఆలయ జీర్ణోద్ధరణకు తీర్మానం

ముస్తాబాద్‌: మండల కేంద్రంలోని వేణుగోపాలస్వామి ఆలయ జీర్ణోద్ధరణకు తీర్మానించారు. ఆలయ కమిటీ బాధ్యులు గుండెల్లి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో శనివారం గ్రామస్తులు సమావేశమయ్యారు. వేణుగోపాలస్వామి ఆలయ పునర్‌నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణకు అందరూ సహకరించాలని కోరారు. ఇప్పటికే నలభై మంది శాశ్వత సభ్యులుగా ఆలయ కమిటీలో చేరారని తెలిపారు. సర్పంచ్‌ మట్ట వెంకటేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్లమెంట్‌ కో–కన్వీనర్‌ కనమేని చక్రధర్‌రెడ్డి, నాయకులు యెల్ల బాల్‌రెడ్డి, గజ్జెల రాజు, తిరుపతి, విజయ్‌రెడ్డి, నరేశ్‌, నర్సింహారెడ్డి, సంతోష్‌రావు, భరత్‌, నల్ల నర్సయ్య, మల్లయ్య, సంతోష్‌రెడ్డి, మహేందర్‌, గోపి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement