● స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్ జిల్లా కోఆర్డినేటర్ సురేశ్
ముస్తాబాద్: స్వచ్ఛభారత్ గ్రామీణ్ మిషన్ ప్రత్యేక యాప్ ద్వారా పారిశుధ్య నిర్వహణ వివరాలు నమోదు చేయాలని ఎస్బీఎంజీ జిల్లా కోఆర్డినేటర్ సురేశ్ కోరారు. మండల పరిషత్‌లో శనివారం పంచాయతీ కార్యదర్శులకు స్వచ్ఛభారత్ కొత్త యాప్ అంకాల్పై అవగాహన కల్పించారు. సురేశ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అంకాల్ యాప్ ద్వారా పారిశుధ్య పనులపై సర్వే జరుగుతుందన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోనివారి వివరాలు, నిర్మించుకుని వినియోగిస్తున్న వారి వివరాలు నమోదు చేయాలని సూచించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తారన్నారు. అసిస్టెంట్ కో–కన్వీనర్ ప్రేమ్, ఎంపీడీవో లచ్చాలు, ఎంపీవో వాజిద్, ఏపీవో ఆనంద్‌మోహన్ పాల్గొన్నారు.
ఐక్య కూటమి జెండా ఆవిష్కరణ
సిరిసిల్ల అర్బన్: ఇటీవల జరిగిన ఆర్టీసీ ఎన్నికల్లో ఐక్య కూటమి విజయం సాధించడంతో సిరిసిల్ల ఆర్టీసీ బస్ డిపోలో(ఈయూ, టీఎంయూ, ఎన్ఎంయూ) ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. పదేళ్ల తర్వాత నిర్వహించిన ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో ఐక్య కూటమి విజయం సాధించిన సందర్భంగా బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. రీజియన్ అధ్యక్షుడు జీపీ సింగ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జి.మల్లేశ్, డిపో అధ్యక్షుడు వి.రాజేందర్, కార్యదర్శులు ఎల్.రాంరెడ్డినాయక్, జేఎస్ఎన్ రావు పాల్గొన్నారు.


