సిరిసిల్లటౌన్: భక్తజన కోటి బ్రహ్మాండ నాయకుడు, అష్టోత్తర శత సుదర్శన సాలగ్రామ ధారి, శ్రీశాల లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. పది రోజులపాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటలకు స్నపన తిరుమంజనం, సాయంత్రం నుంచి రాత్రి వరకు విశ్వక్‌సేన ఆరాధన, వాసుదేవీ పుణ్యహవచనం, అంకురారోపణం నిర్వహించారు. ఆలయ కమిటీ ఈవో మారుతిరావు, ఏఈవో పీసరి రవీందర్, లక్ష్మణ్, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్లు ఉప్పుల విఠల్‌రెడ్డి, తీగల శేఖర్‌గౌడ్, చేపూరి నాగరాజు, అర్చక స్వాములు కృష్ణమాచారి, నవీన్‌చారి పాల్గొన్నారు.


