పదవులు ప్రజాసేవకు అంకితం చేయాలి | - | Sakshi
Sakshi News home page

పదవులు ప్రజాసేవకు అంకితం చేయాలి

Oct 16 2026 10:34 AM | Updated on Oct 16 2026 10:34 AM

● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

చందుర్తి: పదవులు అలంకారప్రాయంగా మిగిలిపోకుండా ప్రజాసేవకు అంకితం చేయాలని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. చందుర్తి మండలం సనుగుల, చందుర్తి సింగిల్‌విండో పాలకవర్గ సభ్యులకు గురువారం ఏ ర్పాటు చేసిన అభినందన సభలకు హాజరై వారిని సన్మానించారు. విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ పదవుల్లో ఉన్నవారు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా ప్రజల సంక్షేమం, అభివృద్ధికి పాటు పడాలన్నారు. ఆత్మ కమిటీ చైర్మన్‌ ముస్కు ముకుందరెడ్డి, చందుర్తి, సనుగుల సింగిల్‌విండో అధ్యక్షులు గసికంటి ప్రభాకర్‌, ఏగోలపు శ్రీనివాస్‌గౌడ్‌, సర్పంచులు పులి సత్తయ్య, బొడిగే లావణ్యఅనిల్‌, వేములవాడ, రుద్రంగి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌లు రొడ్డి రాజు, చెలుకల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement