సిరిసిల్లటౌన్: ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్, ప్రభుత్వ సాధారణ వైద్యశాల ఆధ్వర్యంలో గురువారం నేతన్నలకు అవగాహన కల్పించారు. స్థానిక వెంకట్రావ్నగర్లోని పవర్లూమ్ కార్మికులకు మానసిక ఆరోగ్య సమస్యలపై సైకాలజిస్ట్ పున్నంచందర్ మాట్లాదారు. పని ఒత్తిడి, నిద్రలేమి, ఆహార నియమాలు పాటించకపోవడంతో కార్మికులు జీవనశైలి వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. ఒత్తిడిని జయించడానికి మద్యపానాన్ని ఆశ్రయించి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. రాపెల్లి లత, కొండ ఉమ, శ్రీమతి పాల్గొన్నారు.


