సిరిసిల్ల: పద్మశాలీ బిడ్డగా తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని హైకోర్టు న్యాయవాది, తెలంగాణ జేఏసీ నాయకులు గుడ్ల జ్యోతికిరణ్ కోరారు. సిరిసిల్ల టౌన్ క్లబ్‌లో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పద్మశాలీ బిడ్డను ఈసారి శాసన మండలికి పంపుదామని సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్ల బహిరంగ సభలో ప్రకటించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. స్థానికంగా అందుబాటులో ఉంటా నని, పద్మశాలీల వృత్తిపరమైన సమస్యలు పరిష్కరిస్తానన్నారు. పద్మశాలీ సమాజం తనకు అండగా ఉందన్నారు. కాంగ్రెస్ బలపేతానికి కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కోరు తూ పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌లను కలిశానని.. వారు సానుకూలంగా ఉన్నారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు యెల్లె లక్ష్మీనారాయణ, చొప్పదండి ప్రకాశ్, కల్లెపల్లి అశోక్, మామిడాల భూపతి, పత్తిపాక లక్ష్మీరాజం, మ్యాన రవి, వైద్యశివప్రసాద్, శ్రీగాథ మైసయ్య పాల్గొన్నారు.


