కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు | - | Sakshi
Sakshi News home page

కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు

Oct 16 2026 10:34 AM | Updated on Oct 16 2026 10:34 AM

కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు ● కొద్ది రోజుల క్రితం డీసీఎంకు ఢీకొట్టిన వైనం

● కొద్ది రోజుల క్రితం డీసీఎంకు ఢీకొట్టిన వైనం

తంగళ్లపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల పరిధిలో ఆందోళనకరమైన ఘటన చోటుచేసుకుంది. ఒకే ఆర్టీసీ బస్సు ఒకే ప్రాంతంలో కొద్ది రోజుల వ్యవధిలోనే రెండుసార్లు ప్రమాదానికి గురైంది. స్థానికులు తెలిపిన వివరాలు. మండలంలోని నేరెళ్ల గురుకుల పాఠశాల సమీపంలోని మూలమలుపు వద్ద వేములవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుధవారం ఎదురుగా వస్తున్న ఓ కారును ఢీకొట్టింది. ఇదే బస్సు కొద్ది రోజుల క్రితం అదే మూలమలుపు వద్ద డీసీఎం వ్యాన్‌ను ఢీకొట్టింది.

చెట్లు అడ్డుగా ఉండటమే కారణం

ఈ మలుపు వద్ద రోడ్డుకు ఇరువైపులా చెట్లు, పొదలు దట్టంగా పెరిగిపోయాయి. దీంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదని వాహనదారులు తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి, ప్రమాదాలకు కారణమవుతున్న చెట్ల కొమ్మలను తొలగించాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement