డీఈవోకు సన్మానం | - | Sakshi
Sakshi News home page

డీఈవోకు సన్మానం

Oct 16 2026 10:34 AM | Updated on Oct 16 2026 10:34 AM

సిరిసిల్ల: జిల్లా నూతన విద్యాధికారిగా విధుల్లో చేరిన జె.విజయ్‌సాగర్‌ను గురువారం తెలంగాణ ట్రైబల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌(టీజీటీటీఎఫ్‌) ప్రతినిధులు సన్మానించారు. జిల్లా విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్‌ సాగర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. డీవైఎస్‌వో అజ్మీరా రాందాస్‌, మదన్‌లాల్‌, రాజు, శ్రీనివాస్‌ ఉన్నారు.

పల్లగుట్టపై తవ్వకాలు నిలిపివేయండి

సిరిసిల్లటౌన్‌: ముస్తాబాద్‌ మండలం నామాపూర్‌, గూడూరు మధ్య ఉన్న పల్లగుట్టపై జరుగుతున్న రంగురాళ్ల(గ్రానైట్‌ క్వారీ) తవ్వకాలు నిలిపివేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కోరారు. ఈమేరకు కార్మిక, ఉపాధి, గనులశాఖ మంత్రి జి.వివేక్‌ వెంకటస్వామికి గురువారం లేఖను అందజేశారు. వెంకటరెడ్డి మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంతంలో 60 ఎకరాలలో తవ్వకాలకు అనుమతులు ఇచ్చినప్పటికీ, గ్రామస్తుల ఒత్తిడితో కాంట్రాక్ట్‌ రద్దు చేశారని గుర్తుచేశారు. మళ్లీ అదే కాంట్రాక్టర్‌ 12 ఎకరాలలో తిరిగి తవ్వకాలు చేపట్టారని తెలిపా రు. తవ్వకాలను వెంటనే నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

‘కొలతల ప్రకారం పనులు చేయాలి’

చందుర్తి: వీబీజీ రామ్‌ జీ పథకంలో నిబంధనల ప్రకారం కందకాలు తీయడం లేదని ఫీల్డ్‌ అసిస్టేంట్‌ రమేశ్‌ పని తీరుపై టెక్నికల్‌ అసిస్టెంట్‌ గంగజల గురువారం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. చందుర్తి మండలం తిమ్మాపూర్‌ శివారులోని గుట్ట ప్రాంతంలో కందకాల తవ్వకాల పనులు కొనసాగుతున్నాయి. కూ లీలు మాట్లాడుతూ అందుబాటులో పనులు కల్పించాలని కోరుతున్నారు. ఈ విషయమై చందుర్తి ఏపీవో రాజయ్యను వివరణ కోరగా కొలతల ప్రకారం పనులు చేయించాలని టెక్నికల్‌ అసిస్టెంట్‌ సూచించారని తెలిపారు.

ఆర్టీసీ డ్రైవర్‌ బలవన్మరణం

సిరిసిల్లటౌన్‌: నిత్యం వందలాది మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చి ఆర్టీసీ డ్రైవర్‌, అనారోగ్య సమస్యలతో మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడిన ఘటన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. జిల్లా కేంద్రంలోని బీవైనగర్‌కు చెందిన డి.సత్యనారాయణ(55) ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఎనిమిది నెలల క్రితం పక్షవాతం బారిన పడడంతో మెడికల్‌ లీవ్‌ తీసుకుని ఇంటి వద్దే ఉంటున్నాడు. ఎప్పుడూ చురుగ్గా ఉండే సత్యనారాయణ మంచానికే పరిమితం కావడం, కుటుంబానికి భారం అవుతున్నాననే మానసిక వేదనతో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్య మమత, కుమారుడు అరవింద్‌, కుమార్తె హాసిని ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement