● వాసవీ కల్యాణ మండపంలో ప్రారంభం ● ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని వాసవీ కల్యాణ మండపంలో జోయాలుక్కాస్ జ్యువెల్లరీ ప్రదర్శనను మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి గురువారం ప్రారంభించారు. సిరిసిల్లలో గురు, శుక్ర, శనివారాల్లో మూడు రోజులపాటు ప్రపంచస్థాయి పేవరేట్ జ్యువెల్లరీ ప్రదర్శనను నిర్వహిస్తున్నామని జోయాలుక్కాస్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అన్ని జ్యువెల్లరీల మజూరీ చార్జీల(వీఏ)పై అత్యుత్తమైన ఫ్లాట్ 50 శాతం తగ్గింపు ధరలతో బిగ్ షో కం సేల్స్ నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రారంభ వేడుకల్లో జిల్లా రెవెన్యూ అధికారి గొట్టె జయశ్రీ, మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా, ఎస్సీ కార్పొరేషన్ ఈవో డి.స్వప్న, మత్స్యశాఖ అధికారి సౌజన్య, జోయాలుక్కాస్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. నగరాలకే పరిమితమైన జ్యువెల్లరీల ప్రదర్శనలు సిరిసిల్ల వంటి పట్టణంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాగా ఆవిర్భావంతో అత్యుత్తమమైన సంస్థలు సిరిసిల్ల తలుపు తట్టుతున్నాయని, జోయాలుక్కాస్ సంస్థ లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షించారు.


