సిరిసిల్ల: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. రగుడు బైపాస్‌రోడ్ వద్ద పబ్లిక్ మీటింగ్ స్థలాన్ని సోమవారం ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే, కామారెడ్డి ఎస్పీ రాజేశ్‌చంద్ర, ఐఎస్‌డబ్ల్యూ ఎన్‌సీ ఎస్పీ మాధవరావుతో కలిసి పరిశీలించారు. అంతకుముందు జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో హెలీప్యాడ్ పనులు పరిశీలించారు.
కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష
కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే, కామారెడ్డి ఎస్పీ రాజేశ్‌చంద్ర, ఐఎస్‌డబ్ల్యూఎన్సీ ఎస్పీ మాధవరావు, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈఈ ఆర్‌అండ్‌బీ హెలీప్యాడ్, స్తభాస్థలి వద్ద స్టేజీ, పార్కింగ్ ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. పారిశుధ్య పనులు, తాగునీటి సరఫరా కోసం ఏర్పాట్లు చేయాలన్నారు. అంతకుముందు కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆర్డీవోలు శ్రీధర్‌బాబు, కేఎస్బీ కుమారి, ఆర్‌అండ్‌బీ ఈఈ భీమ్లానాయక్, డీఎంహెచ్‌వో ఏంజెలా ఆల్ఫ్రెడ్, జిల్లా రవాణాశాఖ అధికారి శ్రీనివాస్, ఎకై ్సజ్ అధికారి హిమశ్రీ, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, డీఎస్పీలు నాగేంద్రాచారి, నర్సిరెడ్డి, కమిషనర్లు ఖదీర్‌పాషా, లోకేశ్ పాల్గొన్నారు.


