సీఎం సభతో అక్రమార్కుల్లో వణుకు | - | Sakshi
Sakshi News home page

సీఎం సభతో అక్రమార్కుల్లో వణుకు

Sep 29 2026 12:27 AM | Updated on Sep 29 2026 12:27 AM

● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

సిరిసిల్ల: సీఎం రేవంత్‌రెడ్డి సభ అంటే అక్రమార్కుల్లో వణుకుపుట్టిందని, తమ బండారం ఎక్కడ బయటపతుందోనని ఆందోళన మొదలైందని ప్ర భుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. సిరిసిల్ల బైపాస్‌ రోడ్డులో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనే సభాస్థలి వద్ద సోమవారం ప్రభుత్వ సలహాదారు వి.హన్మంతరావు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌, సిరిసిల్ల ఇన్‌చార్జి కె.కె.మహేందర్‌రెడ్డి సమక్షంలో మీడియాతో మా ట్లాడారు. సిరిసిల్ల సభ కేటీఆర్‌ను కంగారుపెడుతోందని, ఆ కంగారుతోనే కంగాలి లేఖ రాశారన్నా రు. సిరిసిల్లలో నిన్ను తొక్కడానికి విష్ణుమూర్తి అవతారంలో రేవంత్‌రెడ్డి వస్తున్నాడని, మొదటి అడుగు సిరిసిల్లలోనే పడిందని, రెండో అడుగు సిద్దిపేటలో, మూడో అడుగు గజ్వేల్‌లో పడబోతుందన్నారు. ఇన్ని రోజులు సిరిసిల్లకు నువ్వు ఏం చేశావో.. ఇక్కడి ప్రజలకు ఎంత అన్యాయం చేశావో పక్కాగా లెక్కలు అప్పజెప్పుతామన్నారు. వస్త్రోత్పత్తిదారులకు రూ.300కోట్ల బకాయిలు ఎందుకు వదిలివెళ్లావని, రాజన్న ఆలయ అభివృద్ధిని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. జిల్లాలో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు సాగుతున్నాయని, మరో రూ.340 కోట్ల పనులకు సీఎం శ్రీకారం చుడతార ని ఆది శ్రీనివాస్‌ తెలిపారు. కాంగ్రెస్‌ నాయకులు సంగీతం శ్రీనాథ్‌, కూస రవీందర్‌, గడ్డం నర్సయ్య, బొలుమాల శంకర్‌ తదితరులు ఉన్నారు.

‘సభను విజయవంతం చేయండి’

వేములవాడ: సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రభుత్వ సలహాదారు, ఓబీసీ భారత జాతీయ అధ్యక్షుడు వి.హనుమంతరావు కోరారు. వేములవాడలోని మున్నూరుకాపు సత్రంలో మాట్లాడారు. బీసీలకు న్యాయం చేయడంతోపాటు కులగణన చేపట్టాలని డిమాండ్‌ చేశా రు. మున్నూరుకాపు జిల్లా అధ్యక్షుడు బొప్ప దేవ య్య, జిల్లా ప్రధాన కార్యదర్శి పోనిశెట్టి శంకర్‌, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఎర్రం మల్లయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు నామాల పోశెట్టి, జిల్లా ప్రచార కార్యదర్శి బొప్ప భిక్షపతి, వేములవాడ పట్టణ సంఘం అధ్యక్షుడు కోయినేని బాలయ్య, పటేల్‌ సంఘం అధ్యక్షుడు సారా శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement