కన్నెపల్లి కింద కాపర్‌డ్యాం నిర్మించాలి
బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.జీవన్‌రెడ్డి
సిరిసిల్లటౌన్/ముస్తాబాద్(సిరిసిల్ల): కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల ఎత్తిపోతలపై రాష్ట్ర సర్కారు భేషజాలకు పోవద్డని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.జీవన్‌రెడ్డి సూచించారు. సిరిసిల్లలో పార్టీ ఆఫీస్‌లో శనివారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. గోదవారి జలాలు ఎత్తిపోస్తే మాజీ సీఎం కేసీఆర్‌కు ఎక్కడ పేరొస్తుందోనని లేనిపోని భేషజాలకు పోతున్నారన్నారు. సీఎం మనవడి కోసం ఫుట్‌బాల్ మ్యాచ్‌కు రూ.100 కోట్లు వెచ్చించారని అవే నిధులతో కన్నెపల్లి వద్ద కాపర్ డ్యాం నిర్మితమైతుందన్నారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, రాష్ట్ర నాయకులు గూడూరి ప్రవీణ్, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణారెడ్డి పాల్గొన్నారు.
వెంకటరామారెడ్డి సేవలు ప్రశంసనీయం
నిజాం ప్రభుత్వంలో రాజాబహుదూర్ వెంకట రామారెడ్డి కోత్వాల్‌గా పనిచేసి విద్య, వైద్యం అందరికీ అందేలా చూశారని, ఆయన సేవలు ప్రశంసనీయమని జీవన్‌రెడ్డి కొనియాడారు. ముస్తాబాద్‌లో వెంకటరామారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. రెడ్డీలు రాజకీయంగా, సామాజికంగా ఎదగాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే వుచ్చిడి మోహన్‌రెడ్డి, కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, మాజీ అధ్యక్షుడు చక్రధర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు కుంబాల మల్లారెడ్డి, విగ్రహదాత యెల్ల బాల్‌రెడ్డి, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్‌రెడ్డి, ఆత్మ చైర్మన్ కొండం రాజిరెడ్డి పాల్గొన్నారు.
రేవంత్‌కు సీఎంగా కొనసాగే అర్హత లేదు
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పేదలకు అందకుండా నిర్వీర్యం చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి ఆ పదవి లో కొనసాగే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశా రు. పార్టీ ఆఫీస్‌లో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. మళ్లీ కేసీఆర్ ఈ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తేనే అన్ని పథకాలు అమలవుతాయన్నారు. సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సురేందర్‌రావు, పట్టణాధ్యక్షుడు నర్సింహారెడ్డి, మల్లేశ్, భరత్, స్వామి, నర్సయ్య, నర్సింలు, నవాజ్ పాల్గొన్నారు.


